అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్
అనంతగిరి: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూచించారు. శనివారం వికారాబాద్ పట్టణ పరిధిలోని నర్సరీని పరిశీలించారు. ఎన్ని మొక్కలు పెంచుతున్నారు.. ఏఏ రకాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మొక్కలు ఏపుగా పెరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం శివారెడ్డిపేట్‌లోని జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఏసుదాసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


