● చైతన్యనగర్‌కు
176 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
తాండూరు రూరల్: చెంచులకు ఇళ్లు కట్టిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దేముల్ మండలం చైతన్యనగర్‌లో సర్పంచ్ గౌరమ్మతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామానికి 176 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలతో పాటు, చెంచుల అభివృద్ధికి కేంద్రం పీఏం జన్‌మన్‌తో రూ.1 లక్ష చెల్లిస్తుందని చెప్పారు. నాయకులు మంబాపూర్ నారాయణరెడ్డి, లొంక నర్సింహులు.. చెంచులకు ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టు తీసుకుంటారని పేర్కొన్నారు. ఇళ్లను నాణ్యతగా నిర్మిస్తారన్నారు. అంతేకాకుండా చెంచుకాలనీలో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ దీపాలు, పంచాయతీ భవనం, అంగన్‌వాడీ భవనం, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీహాల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాణి, నాయకులు బిచ్చప్ప, శ్రీనివాస్, బాలయ్య పాల్గొన్నారు. అంతకు ముందు పెద్దేముల్ రైతు వేదికలో 67 కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులు పంపిణీ చేశారు.


