పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ప్రచార కార్యదర్శలు
ధారూరు: ‘ధ్యానం మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. రోగాలను నయం చేస్తుంది’ అని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ధ్యాన ప్రచార కార్యదర్శులు ఆంజనేయరెడ్డి, బాలకృష్ణలు తెలిపారు. మండల పరిధి కేరెళ్లి, బాచారం, ఎబ్బనూర్, మున్నూరు సోమారం, కాచారం గ్రామాల్లో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తలనొప్పి నుంచి క్యాన్సర్ సైతం నిత్య ధ్యానంతో నయం అవుతాయని చెప్పారు. ఒత్తిడుల నుంచి ఉపహశమనం పొందుతారని తెలిపారు. యుక్త వయసులోనే వస్తున్న గుండె జబ్బులను దరి చేరకుండా చేస్తుందన్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి పెంపొందుతుందని వివరించారు. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పిరమిడ్ సంస్థ సభ్యులు సుబద్ర, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


