● మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి
● పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప
పరిగి: మహిళలు వంటింటికి పరిమితం కారాదని, అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానంలో నిలవాలని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప సూచించారు. మంగళవారం పరిగి మండల పరిషత్ కార్యాలయంలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మహిహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీ్త్ర అంటే శక్తి అని.. సీ్త్ర ఉంటేనే కుటుంబ, దేశం, ప్రపంచం బాగుంటుందన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తేనే మహిళలకు గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వరి, కమిషనర్ వెంకటయ్య, ఎంపీడీఓ కరీం, అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్, కౌన్సిలర్లు బాదం అఖిల, హబీబ్‌ఉనిసా, షాహేదాబేగం తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబాను స్పీకర్ ప్రసాద్‌కుమార్ తన కూతురు వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ అనన్యతో కలిసి దర్శించుకున్నారు. సోమవారం రాత్రి దూప హారతి పూజలో, మంగళవారం ఉదయం సాయినాథున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రసాదం అందజేశారు.
ధారూరు: వ్యవసాయ విస్తరణ అధికారుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా సంజూ రాథోడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం వికారాబాద్‌లో వ్యవసాయ విస్తరణ అధికారులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీపతి రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా పెంటయ్య, కోశాధికారిగా విశ్వనాథ్‌ను ఎన్నుకున్నారు.
బషీరాబాద్ ఏఎంసీ
చైర్మన్ మాధవరెడ్డి
బషీరాబాద్: వరి, పత్తి పంటల కొనుగోలుతో మార్కెట్ కమిటీకి రూ.14 లక్షల ఆదాయం సమకూరిందని బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ జి.మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం చైర్మన్ అధ్యక్షతన పాలకవర్గ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్‌కు పన్ను రూపంలో వచ్చిన ప్రతీ పైసాను రైతుల కోసం ఖర్చు చేస్తామన్నారు. మార్కెట్ కమిటీ పాలవ వర్గం సభ్యులతో త్వరలో వ్యవసాయ మార్కెటింగ్‌పై స్టడీ టూర్‌కు వెళ్లనున్నట్లు చెప్పారు. రైతులకు సకాలంలో గన్నీ బ్యాగులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చందర్‌నాయక్, కార్యదర్శి సిద్దమ్మ, సభ్యులు వనమాల, వడ్డే హన్మంతు, మహేందర్‌రెడ్డి, అనూప్ ప్రసాద్, నరేశ్ రాథోడ్, పెంటప్ప, సత్యానందం, మునీర్ తదితరులు పాల్గొన్నారు.


