ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం.. ఆయిల్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం.. ఆయిల్‌ చోరీ

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

యాలాల: గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి, ఆయిల్‌, రాగి(కాపర్‌) తీగను చోరీ చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలకేంద్రం నుంచి దేవనూరు మార్గంలో దీపక్‌ గగ్రాణి వ్యవసాయ క్షేత్రంలో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది. ఇక్కడి నుంచి పలు పంట పొలాలకు విద్యుత్‌సరఫరా అవుతుంది. ఈ క్రమంలో రాత్రివేళదొంగలు భారీ ప్లాస్టిక్‌ పైపు సాయంతో ప్రధాన లైను నుంచి ఉన్న విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించారు. అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌ పైభాగం తెరచి, 25 లీటర్ల ఆయిల్‌, రాగి తీగను అపహరించారు. ఈ క్రమంలో దుండగుడు తన కాలి చెప్పును అక్కడే పడేసుకున్నాడు. ఇలాంటి ఘటన గతంలోనూ చోటు చేసుకుందని రైతులు తెలిపారు. ఈ ఘటనపై జేఎల్‌ఎం నరేందర్‌ సాయంతో రైతులు సోమవారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement