మొయినాబాద్: ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్‌లోని 5వ వార్డు కౌన్సిలర్ సన్వెల్లి అమరేందర్‌రెడ్డి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ముస్లింలకు సోదరులకు పవిత్ర మాసమన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్నవారికి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమరేందర్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలును సైతం అమల్లోకి తెచ్చారు. ఆడపిల్ల పెళ్లికి రూ.51 వేలు, ఆడపిల్ల పుడితే రూ.11 వేల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాణయ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి


