శ్రీవారి సేవకుమరో 13 మంది | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవకుమరో 13 మంది

Mar 17 2026 8:46 AM | Updated on Mar 17 2026 8:46 AM

బొంరాస్‌పేట: శ్రీవారి సేవకు మండల పరిధి రేగడిమైలారానికి చెందిన మరో 13 మంది భక్తులు సోమవారం వెళ్లారు. టీటీడీ సేవా బృందం ఆర్గనైజర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో.. సభ్యులు గ్రామంలోని శ్రీ ఆంజనేస్వామి, శివాలయంలో పూజలు చేశారు. అనంతరం తిరుపతికి బయల్దేరారు. ఈ నెల 17 నుంచి 23 వరకు వారు సేవలు అందించనున్నారు. సేవకు తరలిన వారిలో మంగలి వెంకటయ్య, వెంకట్రాములు, విష్ణువర్ధన్‌, కుర్వ శ్రీశైలం, శేఖర్‌గౌడ్‌, నర్సింహులు, నందు, బాబు, ఉప్పరి అనిల్‌, నెల్లి ఆనంద్‌, కోటగారి మల్లప్ప, శాంతుకుమార్‌, కుమ్మరి రమేశ్‌లున్నారు. ఈ నెల 10న ఇదే గ్రామం నుంచి శ్రీవారి సేవకు 11మంది వెళ్లిన విషయం తెలిసిందే.

క్విజ్‌ పోటీల్లో చిన్నారుల ప్రతిభ

ధారూర్‌: శిక్షణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రభు త్వ పాఠశాలలో సోమవారం మండల స్థాయి క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో ఎంపీపీఎస్‌ తరిగోపుల ప్రథమ స్థానం, ఎంపీపీఎస్‌ గట్టెపల్లి ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన చిన్నారులకు ఎంఈఓ చెన్నయ్య బహుమతులు అందజేశారు.

సబ్బండ వర్గాల ఉన్నతికి కృషి

డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి

కుల్కచర్ల: సబ్బండ వర్గాల ఉన్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషిచేస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లింలకు కానుకలు అందజేశారు. కుల, మతాలకు అతీతంగా రంజాన్‌, ఉగాది పండుగలు జరుపుకోవాలని సూచించారు. గిర్దవరి రవి, జలీల్‌, జాఫర్‌, షర్పొద్దీన్‌ ఉన్నారు.

వ్యక్తిపై దాడి చేసినఐదుగురికి రిమాండ్‌

పరారీలో మరో నిందితుడు

బొంరాస్‌పేట: పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని రిమాండ్‌కు తరలించగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని దుప్‌చర్లకు చెందిన దానని వెంకటేశ్‌పై ఇదే గ్రామానికి చెందిన మైసని నర్సింలు, ఇతని సోదరుడు వెంకటేశ్‌, బంధువులైన చిన్ననందిగామకు చెందిన పోలెపల్లి ప్రవీణ్‌కుమార్‌, అచ్యుతాపూర్‌కు చెందిన మంగిమళ్ల నర్సింలు, గౌతాపూర్‌కు చెందిన మ్యాతరి నర్సిలు, మ్యాతరి రాజు ఆదివారం ఉదయం 11గంటలకు ఊరి శివారులో మూకుమ్మడిగా దాడి చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం క్షతగాత్రుడి మెడికల్‌ సర్టిఫికెట్‌ను పరిశీలించిన కొడంగల్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు న్యాయమూర్తి శ్రీరామ్‌ నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురిని పరిగిలోని సబ్‌ జైలుకు తరలించగా, మ్యాతరి రాజు పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా పాత కక్షల నేపథ్యంలోనే దానని వెంకటేశ్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement