‘హర్‌ ఘర్‌ జల్‌’గా కొండాపూర్‌ఖుర్దు | - | Sakshi
Sakshi News home page

‘హర్‌ ఘర్‌ జల్‌’గా కొండాపూర్‌ఖుర్దు

Mar 9 2026 9:28 AM | Updated on Mar 9 2026 9:28 AM

డీపీఓ జయసుధ

ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చాం: ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంట్రా ఈఈ రవికుమార్‌

ధారూరు: మండల పరిధిలోని కొండాపూర్‌ఖుర్దును హర్‌ ఘర్‌ జల్‌ గ్రామంగా ఆర్‌డబ్ల్యూఎస్‌, గ్రిడ్‌ అధికారులు ప్రకటించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ అధికారులు గ్రామంలో ఆదివారం జల్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ స్వాతి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్‌ భగీరథ తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం, సరఫరా చేస్తున్న నీటిని సంరక్షించుకోవడం మన అందరి బాధ్యత అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారికి జయసుధ మాట్లాడుతూ.. జల్‌ జీవన్‌ గ్రామంలోని అన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామన్నారు. నీటి అవసరం, గ్రిడ్‌ ద్వారా వచ్చే నీటి స్వచ్ఛత, తాగునీటి సరఫరాలో స్వచ్ఛత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంట్రా ఈఈ రవికుమార్‌ మాట్లాడుతూ.. గ్రామంలో 1.20 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేయించి 116 ఇళ్లకు ట్యాప్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు. గ్రామంలో నిర్మించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆస్తులను పంచాయతీకి అప్పగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ గ్రిడ్‌ ఈఈ సురేశ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి విజయరాణి, గ్రామస్తులు దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement