బీజేపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిక

Mar 9 2026 9:28 AM | Updated on Mar 9 2026 9:28 AM

మీర్‌పేట: రాష్ట్రంలో బీజేపీ పట్ల ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. బడంగ్‌పేట సర్కిల్‌ జిల్లెలగూడ మాజీ ఉప సర్పంచ్‌, మాజీ కార్పొరేటర్‌ మేకల విజయలక్ష్మీ రవీందర్‌రెడ్డి దంపతులు వారి అనుచరులతో కలిసి ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నాయకులు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో బీజేపీ బలపడుతోందని, త్వరలోనే ఈ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌, జిల్లెలగూడ డివిజన్‌ అధ్యక్షుడు ముఖేష్‌ ముదిరాజ్‌, స్థానిక నాయకులు గాజుల మధు, సిద్దాల శ్రీనివాస్‌, తిరుపతిరెడ్డి, ఉదయ్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement