పరిగి: ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండరాదని.. అది చట్టరీత్యా నేరమని తహసీల్దార్ వెంకటేశ్వరి సూచించారు. మంగళవారం పట్టణ కేంద్రంలో బీఎల్‌ఓలతో, రాజకీయ పార్టీలతో అధికారులతో సర్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో, పట్టణంలో బీఎల్‌ఓలు ప్రతీ ఇంటింటికి తిరిగి ఓటరు సవరణ కార్యక్రమాన్ని చేపడతారని చెప్పారు. ఆయా పార్టీల నాయకులు గ్రామాల్లో పట్టణంలో సహకరించాలన్నారు. బీఎల్‌ఓలు అడిగిన ప్రశ్నలకు ఓటర్లు పూర్తిగా సమాచారం అందించి సహకరిస్తే ఓటరు సవరణ కార్యక్రమం త్వరగా పూర్తవుతుందని చెప్పారు. ఓటరు లిస్టులో మృతి చెందిన వారి పేర్లు, చిరునామా మార్పులు చేసుకున్న వారి పేరు, రెండు మూడు ఓటరు కార్డులు ఉన్న వారివి ఈ సర్వే ద్వారా తొలగిపోతాయన్నారు. ఇప్పటి వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోని యువత సైతం ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, డీటీలు విజయేందర్, అనిల్‌బాబు ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ వెంకటేశ్వరి


