గ్యాస్‌ ధరలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ధరలు తగ్గించాలి

Mar 9 2026 9:28 AM | Updated on Mar 9 2026 9:28 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్‌

అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్‌ అన్నారు. ఆదివారం వికారాబాద్‌ మండలంలోని జైదుపల్లిలో వంట గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అంతర్జాతీయ విషయాలు సాకు చూపుతూ పేదోడిపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనసూయ, వెంకటమ్మ, సుక్కమ్మ, లక్ష్మి, స్వరూప, స్పందన తదితరులు పాల్గొన్నారు.

యుద్ధం సాకుతో ఆర్థికభారం

దుద్యాల్‌: కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బుస్స చంద్రయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఖాళీ సిలిండర్‌తో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధం సాకుతో పేదలపై ఆర్థిక భారం మోపితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సందీప్‌, నరేశ్‌, సాయి కుమార్‌, ప్రసాద్‌, కృష్ణవేణి, రేణుక, సావిత్ర తదితరులు పాల్గొన్నారు.

పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి

పరిగి: కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్‌ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బస్టాండ్‌ ఎదుట ఖాళీ గ్యాస్‌ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచుతూ రూ.60వేల కోట్ల భారాన్ని దేశ ప్రజలపై వేయడాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌, అమెరికా చేస్తున్న యుద్దం పేరుతో చమురు నిల్వల కొరత ఉండనున్నదనే సాకుతో ధరలను పెంచారన్నారు. విశ్వగురువుగా చెప్పుకునే ప్రధాని మోదీ యుద్దాన్ని ఎందుకు ఆపలేకపోయారని దుయ్యబట్టారు. పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు హబీబ్‌, సత్తయ్య, అక్బర్‌, రాఘురాం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ధరల పెంపు సబబు కాదు

తాండూరు టౌన్‌: పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు ఆదివారం ఖాళీ సిలిండర్‌తో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇరాన్‌, అమెరికా యుద్ధం సాకుతో కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచడం సబబు కాదన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే త్వరలోనే పెట్రోలు, డీజిల్‌ ధరలను సైతం పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్‌ ధరలను తగ్గించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ ఆందోళనలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్‌, ప్రజాసంఘాల నాయకులు చంద్రయ్య, రత్నం, దస్తప్ప, రవికుమార్‌, రాములు, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement