మొక్కల సంరక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

మొక్కల సంరక్షణకు చర్యలు

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

బంట్వారం: నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ రాములు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఆయన మాలసోమారంలో నర్సరీని పరిశీలించి, శుభ్రం చేయించారు. సిబ్బందికి సూచనలు చేశారు. వేసవి దృష్ట్యా ఎప్పటికప్పుడు నీరు పట్టాలన్నారు. వానాకాలంలో చేపట్టే వన మహోత్సవం నాటికి మొక్కలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

సంరక్షించాలి

కుల్కచర్ల: మొక్కలను సంరక్షించాలని రాంరెడ్డిపల్లి సర్పంచ్‌ నర్సింహలు యాదవ్‌ అన్నారు. సోమ వారం గ్రామంలోని నర్సరీ పరిశీలించారు. అక్కడి సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు చేశారు. నీరు పట్టించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాల వద్ద మొక్కలను నాటాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement