మహిళలు.. శక్తిమంతులు | - | Sakshi
Sakshi News home page

మహిళలు.. శక్తిమంతులు

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

తాండూరు టౌన్‌: అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు శక్తిమంతులు అని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మున్సిసల్‌ కార్యాలయ ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ పట్లోళ్ల దీప తోపాటు పలువురు మహిళా కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు, మున్సిపల్‌ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సాంకేతిక ప్రపంచంలో మగువలు, పురుషులకు సమానంగా ప్రగతి సాధించారన్నారు. అన్ని రంగాల్లో పైచేయి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ రజాక్‌, కమిషనర్‌ మధుసూదన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

మహిళా కౌన్సిలర్ల్లు, ఆర్పీలు, మున్సిపల్‌ సిబ్బందికి సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement