బంట్వారం: కోట్‌పల్లి మండలం మోత్కుపల్లి పంచాయతీ 2023 – 24 ఆర్థిక సంవత్సరం స్కోర్ ఆధారంగా గుడ్ గవర్నెన్స్‌కు నామినేటెడ్ అయ్యింది. దీంతో కేంద్ర బృందం సీనియర్ కన్సల్‌టెంట్ శ్రీపంత్ దీప్ సింగ్ మంగళవారం జీపీని సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ అవార్డు కోసం మోత్కుపల్లి గ్రామ పంచాయతీ గుడ్ గవర్నెన్స్‌లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటికే నామినేటెడ్ కావండతో పరిశీలనకు వచ్చినట్లు చెప్పారు. ఇంటి పన్నుల వసూలు, ఆన్‌లైన్ నమోదు, రికార్డుల నిర్వాహణ సంతృప్తికరంగా ఉందన్నారు. వీటి స్కోర్ ఆధారంగానే గుడ్ గవర్నెన్స్‌కు నామినేట్ చేయడం జరిగిందన్నారు. వీటిలో వచ్చిన పాయింట్ల ఆధారంగా నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ సంధ్యారాణి, ఎంపీడీఓ సురేందర్‌రెడ్డి, సర్పంచ్ అమృతమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


