కేజీబీవీలో తరగతి గదులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలో తరగతి గదులు ప్రారంభం

Mar 16 2026 9:00 AM | Updated on Mar 16 2026 9:00 AM

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం మారెపల్లి గేటు వద్ద కేజీబీవీలో రూ.2.30 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆదివారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మారెపల్లి గేటు వద్ద ఉన్న ఆరే మైసమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నీరజ, సర్పంచ్‌ మంగళి సునీత, కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అంజయ్య, నారాయణరెడ్డి, నాయకులు శోభరాణి, లొంక నర్సింలు, గోపా ల్‌రెడ్డి, కరణం పురుషోత్తంరావు, ఉప్పరి మల్లేశం, ఎల్లారెడ్డి, రియాజ్‌, హరీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement