క్రీడలు యువజన
విభాగం జిల్లా అధికారి సత్తార్
దోమ: విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో దేశ సమైక్యతను చాటాలని క్రీడలు, యువజన విభాగం జిల్లా అధికారి సత్తార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ సమీపంలోని శ్రీ అనంత పద్మనాభ ఏఎస్‌ఏపీ కళాశాలలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. దోమ, పరిగి, పూడూరు, వికారాబాద్ కేజీబీవీలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా డీవైఎస్‌ఓ ఐజయ్య ఆధ్వర్యంలో రన్నింగ్, స్కిప్పింగ్, వాలీబాల్, ఖోఖో తదితర పోటీలు నిర్వహించారు. దోమ కేజీబీవీకి చెందిన 9వ తరగతి విద్యార్థినులు కే అనూష, కే. పావనీత పరుగు పందెంలో, అనూష స్కిప్పింగ్‌లో సత్తాచాటారు. వారిని అభినందించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో పీఈటీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి
బంట్వారం: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి అన్నారు. శుక్రవారం కోట్‌పల్లి మండలం కరీంపూర్ పీహెచ్‌సీ పరిధిలోని బార్వాద్‌లో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో కరీంపూర్ పీహెచ్‌సీ డాక్టర్ నిరోష, వైద్యులు జయలక్ష్మి, జయరాం, హెచ్‌ఈఓ రవీందర్‌రెడ్డి, ఎంఎల్‌హెచ్‌పీలు దివ్య, శ్రావణి, ఏఎన్‌ఎంలు నర్సమ్మ, ప్రభావతి, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వినియోగదారులకు ఏమైన సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ సెల్ నంబర్ 9885930418కు కాల్ చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సుదర్శన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతగిరి: ఇంటర్‌మీడియట్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. విద్యార్థులు తమ స్నేహితులతో కాసేపు ముచ్చటిస్తూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. రెండేళ్ల వారి స్నేహాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు భావోద్వేగానికి గురయ్యారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల వెంట సొంత గ్రామాలకు బయలుదేరారు.
తాండూరు రూరల్: మండలంలోని కరన్‌కోట్ గ్రామానికి చెందిన గోవింద్‌గౌడ్ డాక్టరేట్ పట్టా పొందారు. నగరంలోని మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జేఎన్‌టీయూహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ పి.శ్రావణ పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.


