ధారూరు: అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి అనసూయ డిమాండ్ చేశారు. మండల పరిధి మోమిన్‌కలాన్ గ్రామంలో బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పింఛన్లు రాక వృద్ధులు, వితంతువులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇచ్చిన మాటా ప్రకారం ప్రభుత్వం వారికి ఆసరా ఇచ్చి, ఆదుకోవాలని కోరారు. రోజురోజుకూ మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. అనంతరం మోమిన్‌కలాన్ గ్రామ ఐద్వా మహిళా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షురాలిగా సంతోష, ఉపాధ్యక్షురాలిగా వెంకటమ్మ, ప్రధాన కార్యదర్శిగా సుగుణమ్మ, సహాయ కార్యదర్శులుగా కాశమ్మ, యాదమ్మ, అమృతమ్మ, రాములమ్మ, మణెమ్మలను ఎన్నుకున్నారు.


