దౌల్తాబాద్: మండలంలోని దేవర్‌ఫసల్‌వాద్ గ్రామం సామాజిక భద్రతలో ఉత్తమ పంచాయతీగా ఎంపికై ంది. మంగళవారం గ్రామంలో కేంద్ర బృందం పర్యటించింది. అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలు, రేషన్ దుకాణాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి తారాచంద్, కన్సల్టెంట్ సంత్‌దీప్‌సింగ్ తదితరులు డీపీఓ జయసుధతో కలిసి పరిశీలించారు. ముందుగా గ్రామసభ నిర్వహించి స్థానికులతో మాట్లాడారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఉపాధి పనుల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, డీఎల్‌పీఓ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


