● మున్సిపల్ చైర్‌పర్సన్ అనన్య
● ఘనంగా మహిళా దినోత్సవం
అనంతగిరి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం సత్యభారతి గార్డెన్స్‌లో అనన్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కమిషనర్ విక్రం సింహారెడ్డి, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


