పర్యావరణ పరిరక్షణ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ ముఖ్యం

Mar 13 2026 9:07 AM | Updated on Mar 13 2026 9:07 AM

కడ్తాల్‌: కళాశాలలు ప్రకృతి పరిరక్షణ కేంద్రాలుగా మారాలని వందేమాతరం ఫౌండేషన్‌ జనరల్‌ సెక్రటరీ మాధవరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్‌సెంటర్‌లో కాచిగూడ బంకట్‌లాల్‌ భద్రుక కాలేజీ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి చెందిన విద్యార్థులకు ఎన్విరాన్‌మెంటల్‌ ఓరియంటేషన్‌ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన, అంకితభావం బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. అనంతరం సీజీఆర్‌ సంస్థ ప్రతినిధులు రజనీకాంత్‌, నాగేశ్‌లు విత్తనబంతుల తయారీ, మదర్‌ ట్రీ సంరక్షణ, నేచర్‌ వాక్‌, ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు లలితాదేవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement