రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
పరిగి: మిల్లర్లకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ దీపక్ తివారిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు విధించిన 25శాతం ఫెనాల్టీ, 12శాతం వడ్డీని మాఫీ చేయాలని కోరారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్లు అప్పుల ఊబీలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న రైస్ మిల్లు వ్యవస్థ దివాల స్థితికి చేరుకుందన్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని, అధిక విద్యుత్ చార్జీలు, ధాన్యం ఇచ్చినంత త్వరగా బియ్యం తీసుకోకపోవడంతో నష్టాలు వస్తున్నట్లు చెప్పారు. వెంటనే బకాయిలు విడుదుల చేయడంతోపాటు ఫెనాల్టీ, వడ్డీని రద్దు చేయాలని కోరారు.


