సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి

Mar 12 2026 9:13 AM | Updated on Mar 12 2026 9:13 AM

అనంతగిరి: లైసెన్స్‌ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం వికారాబాద్‌లో పలువురు సర్వేయర్లు ఆయనను వికారాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడారు. సర్వేయర్లకు ఇచ్చిన హామీ ప్రకారం బాధ్యతలు అప్పగించి, వేతనాలు చెల్లించాలన్నారు. హామీ ఇచ్చి 8 నెలలు గడిచినా.. కాలయాపన చేయడం ఏంటని ప్రశ్నించారు. సుమారు పదివేల మంది లైసెన్స్‌ సర్వేయర్లను ప్రభుత్వం అయోమయంలో పెట్టి, రోడ్డున నిలబెట్టిందని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమయిందని, దీంతో మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం బయట పడిందన్నారు. వికారాబాద్‌ నియోజకవర్గంలో 97 మంది సర్వేయర్లు ఉన్నారని, ఈ విషయంలో స్పీకర్‌ స్పందించి వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, సర్వేయర్ల మండల అధ్యక్షుడు శ్యాం, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement