● ఎమర్జెన్సీ అంబులెన్స్‌ల ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ షాహిద్
● 108, 102 వాహనాలను తనిఖీ చేసిన జిల్లా అధికారులు
కొడంగల్ రూరల్: ప్రమాద సమాచారం అందగానే తక్షణం స్పందించాలని ఎమర్జెన్సీ అంబులెన్స్‌ల ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ షాహిద్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. బుధవారం ఈఎంఈలు అబ్దుల్‌రహీం, శ్రీనివాస్, శ్రీహరితో కలిసి పట్టణంలో 102, 108 వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 108, 102 సేవలను ఉచితంగా అందిస్తోందన్నారు. ప్రజలకు నిరంతర సేవలు అందించడంలో ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. 108 వాహనాల్లో పనిముట్లు, మందులు, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది ఆంజనేయులు, వినయ్, వేణుగోపాల్, విజయకుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


