కలెక్టర్ దీపక్ తివారి
అనంతగిరి: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ దీపక్ తివారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గృహ, విద్యాలయాలు, ఆస్పత్రులకు ఎల్‌పీజీ సరఫరాలో ఎలాంటి లోటు లేదన్నారు. ప్రజలు ఆందోళన చెందరాదని సూచించారు. ప్రజా అవసరాల మేరకు సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్ విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.


