చేవెళ్ల: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును అమలు చేయాలని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ పార్థసింహారెడ్డికి వివనతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం విద్యను వ్యాపారంగా మార్చి రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం ఉచితంగా సీట్లు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటీకీ ఎక్కడా ఎవరూ అమలు చేయడం లేదన్నారు. వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్స్ తీసుకునే సమయానికి చట్టం అమలయ్యేలా చర్యలు చెపట్టాలన్నారు.


