దుద్యాల్: మామిడి పంట సాగు చేస్తున్న రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యాన వన జిల్లా అధికారి ఎంఏ సత్తార్ సూచించారు. బుధవారం మండలంలోని హస్నాబాద్ రైతు వేదికలో మామిడి సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పంట పిందె దశకు చేరుకుందని సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. పిందె, కాయ దశలో మొక్కలకు అందించాల్సిన సూక్ష్మ ఎరువుల గురించి తెలియజేశారు. కూరగాయల సాగు విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రఽంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్ రెడ్డి, మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, కొడంగల్ డివిజన్ ఉద్యానవన అధికారి సురేంద్రనాథ్, హెచ్‌ఈవో బాబ్యా నాయక్, ఏఈవో రేణుక తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన వన జిల్లా అధికారి సత్తార్


