పది హాల్‌ టికెట్లపై క్యూఆర్‌ | - | Sakshi
Sakshi News home page

పది హాల్‌ టికెట్లపై క్యూఆర్‌

Mar 12 2026 9:12 AM | Updated on Mar 12 2026 9:12 AM

దుద్యాల్‌: పదో తరగతి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర విద్యాశాఖ సమూల మార్పులు చేస్తోంది. ఎగ్జామ్స్‌ సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడరాదని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్‌ టికెట్లు అన్ని స్కూళ్లకు చేరినట్లు జిల్లా విద్యాశాఖ తెలిపింది. గతంలో మాదిరి కాకుండా ఈ సారి పోస్టల్‌ శాఖ ద్వారా పాఽఠశాలలకు హాల్‌ టికెట్లు పంపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జెడ్పీహెచ్‌ఎస్‌లు 272 ఉండగా 13,579 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్‌ 13వ తేదీ వరకు ఎగ్జామ్స్‌ జరగనున్నాయి.

క్యూఆర్‌ కోడ్‌

ఈ సారి ప్రయోగాత్మకంగా పదో తరగతి విద్యార్థుల హాల్‌ టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. ఫోన్‌ ద్వారా ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే విద్యార్థి పూర్తి వివరాలతోపాటు పరీక్ష కేంద్రం లైవ్‌ లోకేషన్‌ కూడా సూచిస్తుంది. అలాగే విద్యార్థుల పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ను కూడా హాల్‌ టికెట్‌పై ముద్రించినట్లు అధికారులు తెలిపారు.

తల్లిదండ్రుల ఫోన్లకు..

విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందు కోసం వాట్సాప్‌ నంబర్‌ 80969 68096కు హాయ్‌ అని మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే వెల్‌కమ్‌ టు మీ సేవ అని సమాధానం వస్తుంది. ఆ తర్వాత ఎస్సెస్సీ హాల్‌ టికెట్‌ మార్చి – 2026 అని మెసేజ్‌ పంపితే.. ఒక లింక్‌ వస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి జిల్లా, మండలం, పాఠశాల పేరు టైప్‌ చేసి పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే హాల్‌ టికెట్‌ కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తొలిసారిప్రయోగాత్మకంగా అమలు

స్కాన్‌ చేస్తే విద్యార్థి పూర్తి సమాచారం

తల్లిదండ్రుల వాట్సాప్‌ గ్రూపునకు కూడా..

జిల్లా వ్యాప్తంగా టెన్త్‌ విద్యార్థులు 13,579 మంది

14నుంచి వార్షిక పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement