● అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ రాజు
● తాండూరులో పలు అభివృద్ధి పనుల పరిశీలన
తాండూరు టౌన్: ఆస్తి పన్ను వసూలులో తాండూరు మున్సిపాలిటీ వెనుకపడి ఉందని, వేగం పెంచాలని పట్టణాభివృద్ధి శాఖ నోడల్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ విశాల్ రాజు ఆదేశించారు. సోమవారం తాండూరులో నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పలు విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్తి పన్ను వసూల్ల లక్ష్యం చేరకపోతే రాష్ట్ర, కేంద్ర గ్రాంట్లు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. అందువల్ల 100 శాతం లక్ష్యాన్ని ఛేదించాలని వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం డంపింగ్ యార్డులోని బయో మైనింగ్ పనులను, డీఆర్‌సీ సెంటర్, ఏబీసీ సెంటర్లను పరిశీలించారు. శాంతినగర్ పార్కులో నిర్వహించిన క్లీనింగ్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజతో కలిసి పాల్గొన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. అమృత్ 2.0 కిఒంద నిర్మాణంలో ఉన్న రెండు వాటర్ ట్యాంకుల పనులను పరిశీలించారు. యూఐడీఎఫ్, అమృత్ 2.0 పథకం కింద పనులు ఎప్పుడు పూర్తవుతాయని ఇంజనీరింగ్ విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను తయారు చేయాలని ఆదేశించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ, కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ నాగారం మల్లేశం, ఏఈ ఖాజాహుస్సేన్, ఉదయ్, టిపిబిఓ ప్రియ, నరేష్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


