దౌల్తాబాద్: రాష్టంలో వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌తో పాటు గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నట్లు ఎస్‌పీడీసీఎల్ సీఎండీ తేజస్వి పాటిల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఎన్ని సబ్‌స్టేషన్లు ఉన్నాయి.. ఎంత మంది సిబ్బంది ఉన్నారు.. ఎన్ని ఫీడర్ల ద్వారా సరఫరా జరుగుతోంది.. వేసవిలో ఎంతమేర విద్యుత్ లోడ్ వస్తుందని ఏడీఈ రంగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అంతరాయాన్ని తగ్గించేందుకు ప్రతి సర్కిల్‌కు ఎమర్జెన్సీ రీ స్టోరేషన్ టీం వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వాహనాలకు జీపీఆర్‌ఎస్ ఏర్పాటు చేయడంతో సమస్య ఏర్పడిన ప్రాంతానికి బందాన్ని పంపించాలని సూచించారు. మూడేళ్ల క్రితం ఎంపికై న జూనియర్ లైన్‌మెన్లకు ప్రొబిషన్ పీరియడ్ పూర్తయినా ఇంతవరకు ధ్రువీకరణపత్రాలు అందజేయలేదని పలువురు సీఎండీ దృష్టికి తెచ్చారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీయర్ బాలస్వామి, ఎస్‌ఈ రవిప్రసాద్ ఏఈ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
మరమ్మతుల్లో నిర్లక్ష్యం వద్దు
పరిగి: ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల్లో నిర్లక్ష్యం చేయరాదని ఎస్‌పీడీసీఎల్ సీఎండీ తేజస్వి పాటిల్ సూచించారు. సోమవారం పరిగి పట్టణంలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోతే వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఈ బాగస్వామి, ఎస్‌ఈ రవిప్రసాద్, డీఈ సంజీవి, ఏడీ వెంకట్‌నాయుడు, ఏఈ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


