నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి
నేడు మెజార్టీతో భార్య విజయం
దౌల్తాబాద్: గత ఎన్నికల్లో మండలంలోని చల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అతని భార్య రోజా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో చల్లాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. అప్పట్లో రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ జీపీని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో రమేష్ తన భార్య రోజాను కాంగ్రెస్ మద్దతుతో బరిలో దింపారు. ఆమె సమీప ప్రత్యర్థిపై 558 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామస్తులు రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు.
సర్పంచ్‌లకు
పూర్తి సహకారం
మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి
తాండూరు రూరల్: నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. నూతన సర్పంచులకు పూర్తి సహకారం అందిస్తానని మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పెద్దేముల్ సర్పంచ్‌గా ఎన్నికై న డీవై చిన్న నర్సింలును బుధవారం సన్మానించారు. అనంతరం గ్రామంలోని జితేందర్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల అభివృద్ధికి ఎమ్మెల్సీ నిధుల మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మంచన్‌పల్లి పొలాలకు కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి నీరు వదలాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫోన్ చేసి కోరారు. కార్యక్రమంలో నాయకులు గాజీపూర్ నారాయణరెడ్డి, లక్ష్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నరేష్‌రెడ్డి, రవిశంకర్, మ ధుసూదన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, నారాయణ గౌడ్, రాములు నాయక్, గోపి నాయక్, మన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి


