బంజారాహిల్స్: రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్న వైద్యురాలికి అందులోనే పనిచేస్తున్న యువకుడి నుంచి రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–2లో నివసించే వైద్యురాలు (41) ఓ రిహాబిలిటేషన్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. 2021 సంవత్సరంలో సెంటర్ సూపర్‌వైజర్‌గా నామాల వెంకటేష్ వంశీని నియమించుకున్నారు.
ఈ క్రమంలో వైద్యురాలితో పరిచయం ఏర్పడగా.. ఆమె ఫోటోలు తీస్తూ నానా రకాలుగా వేధించసాగాడు. గత ఏడాది నుంచి వెంకటేష్ వంశీ బాధిత వైద్యురాలిని అనుసరిస్తూ వేధించడం మొదలుపెట్టాడు. గత అక్టోబర్‌లో ఆమె అపార్ట్‌మెంట్‌లోకి కూడా చొరబడి కారును ధ్వంసం చేశాడు. ఆమె అర్ధనగ్న ఫోటోలను, వీడియోలను బంధు మిత్రులకు వాట్సప్‌లో షేర్ చేశాడు. దీంతో తనను వేధిస్తున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ పోలీసులు వెంకటేష్‌వంశీపై బీఎన్‌ఎస్ సెక్షన్ 77, 78 (1)(2), 79, 351 (2), 324 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


