ఆధునిక సమాజంలో మనుషులు ఉచ్చం నీచం మర్చిపోతున్నారు. మానవత్వానికే మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. రెంట్ అడిగిన పాపానికి ఇంటి యజమానిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ సంఘటన వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ లోని ఆరా చిమెరా నివాస సముదాయంలో ఈ సంఘటన జరిగింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు గత నాలుగు నెలలుగా అద్దె చెల్లించపోవడంతో
ఇంటి యజమాని దీప్‌శిఖా శర్మ (48) వారిని అద్దె బకాయి చెల్లించమని అడిగింది. అంతే మరునాటికి సూట్‌కేస్‌లో శవమై తేలింది.
అద్దెకు అడిగినప్పుడు ఇంటి యజమానిని హత్య చేసినందుకు ఒక జంటను అరెస్టు చేశారు. మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోని సూట్‌కేస్ నుండి స్వాధీనం చేసుకున్నారు, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.
హత్య ఎలా జరిగింది?
ఉమేష్ శర్మ వ దీప్‌శిఖా శర్మ సొసైటీలో రెండు ఫ్లాట్‌లను కలిగి ఉన్నారు. ఒక ఫ్లాట్లో వారు ఉంటూ, మరొకదానిని అద్దెకిచ్చారు. ఇందులో అజయ్ గుప్తా , అకృతి గుప్తా దంపతులు నివసిస్తున్నారు. అజయ్ గుప్తా రవాణా వ్యాపారంలో ఉన్నాడు. నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదు, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన దీప్ శిఖబుధవారం, గుప్తా దంపతుల ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో, ఆమె భర్త ఇంట్లో లేడు. అయితే దీప్‌శిఖ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పని మనిషి మీనా ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే గుప్తా దంపతుల ఇంటికి వెళ్ళి ఆరా తీసింది. అప్పుడు వారి ప్రవర్తన, సమాధానాలు అనుమానాన్ని రేకెత్తించాయి. మీనా సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేయించగా, దీప్ శిఖా, గుప్తా దంపతుల ఇంట్లోకి వెళ్లింది గానీ, బయటకు రాలేదని గుర్తించి అప్పుడు పోలీసులకు సమాచారం అందించింది.
ఈలోపు విషయం తెలుసుకొని అప్రమత్తమైన గుప్తా దంపతులు మరో పెద్ద ప్లాన్‌వేశారు. కానీ మీనా సమయ స్ఫూర్తితో వారి ఆటలు సాగలేదు. ఒక పెద్ద సూట్ కేసుతో బయటికి రావడం, ఆటోకి ఫోన్ చేయడం చూసి మీనా వారిని అడ్డుకుంది. పోలీసులు వచ్చిన తర్వాత, గుప్తా దంపతుల ఇంటిని సోదా చేయగా, దిగ్భ్రాంతికరమైన విషయం టైటపడింది. బాధితురాలి మృతదేహం సూట్‌కేస్‌లో గుర్తించారు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి ఎక్కడో పారవేయాలనే వారి ప్లాన్ . పనిమనిషి వారి ప్లాన్‌ను భగ్నం చేసింది.
దీప్ శిఖను ప్రెషర్ కుక్కర్‌తో తలపై కొట్టి, ఆపై దుపట్టాతో గొంతు కోసి చంపారని పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబంపోలీసులకు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీనియర్ పోలీసు అధికారి ఉపాసన పాండే తెలిపారు.


