హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రజలకు భద్రతను కల్పించే క్రమంలో సురక్షితమైన రైలు కార్యకలాపాలను కొనసాగించడానికి , హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్‌లోని బేగంపేట వైపు ఉన్న పాత పాదచారుల వంతెనను కూల్చివేయాలని ప్రణాళిక సిద్దం చేసింది.
ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి రెడ్ హిల్స్ ప్రాంతాన్ని పబ్లిక్ గార్డెన్‌తో కలుపుతుంది మరియు స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో దేనికీ అనుసంధానించబడలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఐదు దశాబ్దాలకు పూర్వం జరిగినది, ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన స్టేషన్ లోనున్న రైల్వే యార్డ్ లైన్ల మీదుగా ఉండడంవలన , రైల్వే కార్యకలాపాలకు మరియు ప్రజలకు ప్రాణ ప్రమాదాన్నికలిగించే అవకాశముంది.
ఊహించని ప్రమాదాన్ని నివారించడానికి, మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని 20-12-2025 మరియు 23-12-2025 మధ్య తొలగిస్తారు. ఈ కాలంలో, అవసరమైన భద్రతా ఏర్పాట్లు అమలులో ఉంటాయి మరియు అవసరమైన విధంగా రైలు కార్యకలాపాలు నియంత్రించబడతాయి.
కూల్చివేత పనులు కఠినమైన భద్రతా జాగ్రత్తలతో మరియు సంబంధిత రైల్వే విభాగాల సమన్వయంతో నిర్వహించబడతాయి. ఈ సంధర్భంగా రైల్వేలు ప్రజల సహకారం కోరుతూ తాత్కాలిక అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తుంది.


