యాదాద్రి(భువనగిరి జిల్లా): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన బీజేపీ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. దీనిలోభాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 సర్పంచులు 20 మంది ఉపసర్పంచ్లు 1000 వార్డులు గెలిచాం. రాష్ట్రంలో 900 సర్పంచులు 1200 ఉపసర్పంచ్లు 10,000 మంది వార్డులను గెలిచాం. గతంలో 162 సర్పంచ్ స్థానాలను ఉండేది.
గ్రామీణ ప్రాంతాలలో కూడా బీజేపీ బలం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో, అవినీతి, అరాచకంతో గెలిచింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీ పథకాల పేరు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయింది వారి అవినీతి గురించి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మినిస్టర్ పీఏలు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు, రాజ్యాంగం మీద గౌరవం లేని వ్యక్తి రాహుల్ గాంధీ.
బీఆర్‌ఎస్ పార్టీనే ఫిరాయింపుల మొదటి ప్రోత్సహించింది. ప్రభుత్వం ఒత్తిడితో స్పీకర్ రాజ్యాంగం వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. రాహుల్ గాంధీ సోనియాగాంధీ వారి వారి కేసులలో బెయిల్ పై ఉన్నారు. బీజేపీ వారిపై కేసు పెట్టలేదు దర్యప్తు సంస్థలు కేసు పెట్టాయి. మా పార్టీ కార్యాలయంలపై దాడి చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
హైదరాబాద్ పర్యటనలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్


