
దీపావళి సందర్భంగా ప్రయాణాలు, హోటల్ బుకింగ్‌లకు బలమైన డిమాండ్ కనిపిస్తోంది. దీపావళి సోమవారం రావడంతో, వరుస సెలవుల నేపథ్యంలో పట్టణాలు, విహార ప్రదేశాలు, వివిధ పట్టణాల మధ్య బస్ సేవలకు జోరుగా బుకింగ్‌లు నమోదవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 95–100 శాతానికి చేరింది. జీఎస్‌టీ సంస్కరణలతో మధ్యశ్రేణి హోటళ్లకు డిమాండ్ ఏర్పడినట్టు హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఏఐ) ప్రెసిడెంట్ కేబీ కచ్చు తెలిపారు.
ఈ ఏడాది దీపావళి కారణంగా వారాంతం ఎక్కువగా ఉండడంతో మెరుగైన పండుగ అనుభవం కోసం ఎక్కువ మంది ముందుగానే తమ ప్రయాణాలకు ప్రణాళిక వేసుకున్నట్టు ఎబిక్స్ ట్రావెలర్స్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విక్రమ్ ధావన్ తెలిపారు. ప్రధానంగా టైర్–2, 3 పట్టణాల్లో వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఎయిర్‌లైన్ బుకింగ్‌లలోనూ 65–70% విహార పర్యటనలకు సంబంధించే ఉన్నట్టు తెలిపారు. క్రితం ఏడాది దీపావళి సీజన్‌తో పోల్చితే ఈ విడత 15–20% బుకింగ్‌లు పెరిగాయని చెప్పారు.
ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా