2025 ప్రారంభంలో రూ. 90500 వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఇప్పుడు భారీగా పెరిగింది. ధరలు పెరుగుదల క్రమంలో జులై 26న 1,18,120 రూపాయల వద్ద నిలిచింది. ఆ తరువాత నెలలో (ఆగష్టు 26) రూ.1,23,126 వద్దను చేరింది. ఇలాగే కొనసాగుతూ.. డిసెంబర్ 26 నాటికి కేజీ వెండి రూ. 2,36,350 వద్ద నిలిచింది.
జులై 26 ధరలతో పోలిస్తే.. డిసెంబర్ 26నాటి ధరలు రెట్టింపు. అంటే ఆరు నెలల కాలంలో వెండి రేటు డబుల్ అయింది. ఈ రోజు మాత్రమే సిల్వర్ రేటు రూ. 20వేలు పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది.

ఈ రోజు (డిసెంబర్ 27) వెండి రేటు రూ. 20000 పెరగడంతో.. కేజీ సిల్వర్ ధర రూ. 2.74 లక్షలకు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ రేటు రూ. 11వేలు పెరిగి.. రూ. 2.51 లక్షల వద్ద ఉంది.
వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలు
వెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.
ఇదీ చదవండి: బంగారం, వెండితోపాటు భారీగా పెరుగుతోన్న మరో మెటల్


