బంగారం, వెండి ధరలు నువ్వా నేనా అని పోటీపడుతున్న సమయంలో.. ప్లాటినం ధర ఆల్‌టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి. ఈ ఏడాది భారతదేశం ఏకంగా 125 శాతం పెరిగింది. దీంతో పదిగ్రాముల ప్లాటినం రేటు సుమారు రూ. 70వేలకు చేరింది. దీంతో ఇన్వెస్టర్లు కూడా ఇందులో విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు.
ప్లాటినం ధరలు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల ప్లాటినం రేటు రూ.4,320 పెరిగి.. రూ. 68,950 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లో ఈ లోహానికి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్లాటినం రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్లాటినం రేటు పెరగడానికి కారణాలు
డిమాండుకు తగిన సరఫరా లేకపోవడమే.
డాలర్ విలువ బలహీనపడటం, కొత్త టెక్నాలజీల్లో ప్లాటినం అవసరం పెరగడం
ప్రపంచ దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, అమెరికా ఆంక్షలు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం
బంగారం, వెండి ధరలతో పోలిస్తే.. ప్లాటినం రేటు కొంత తక్కువ కావడం
ఆటోమొబైల్ క్యాటలిటిక్ కన్వర్టర్లు, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమల్లో కూడా ప్లాటినం వినియోగం ఎక్కువ కావడం


