ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఛానళ్లు అకౌంట్ ఉపయోగించకుండా ఉంటే ఏమవుతుంది?, ఖాతాలోని డబ్బును మళ్లీ విత్‌డ్రా చేసుకోవచ్చాయా?, అనే విషయాలు బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు.
బ్యాంక్ అకౌంట్‌ను రెండేళ్లు ఉపయోగించకుండా (ఎలాంటి లావాదేవీలు చేయకుండా) ఉంటే.. ఇనాక్టివ్ లేదా డోర్మాంట్ అవుతుంది. కొన్ని బ్యాంకుల్లో ఈ గడువు ఏడాది మాత్రమే. అంటే.. గడువు లోపల చిన్న చిన్న లావాదేవీలైన తప్పకుండా చేసి ఉండాలి. లేకుంటే.. డెబిట్ కార్డు పనిచేయకపోవచ్చు, ఆన్‌లైన్ లావాదేవీలు నిలిచిపోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా.. మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు చెల్లించాలి ఉంటుంది. కాబట్టి ఖాతాలోని బ్యాలెన్స్ నెమ్మదిగా తగ్గిపోతుంది.
మీ బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్ అయినప్పటికీ.. అకౌంట్‌లో ఉన్న ఎక్కడికీ పోదు. కానీ ఎక్కువ కాలం ఎవరు క్లెయిమ్ చేయకపోతే.. ఖాతాలోని మొత్తం డబ్బు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్' (DEAF)కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు.. కావలసిన కేవైసీ పూర్తి చేసి మళ్లీ మీ ఖాతాలోని డబ్బును తీసుకోవచ్చు.
కేవైసీ అప్డేట్ చేయాలంటే..
కేవైసీ అప్డేట్ చేసి.. మళ్లీ మీ ఖాతాను యాక్టివేట్ చేయాలంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ ఆధార్, పాన్ వంటివాటితో కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత చిన్న మొత్తంలో లావాదేవీలను చేసుకోవాలి. ఇలా చేస్తే.. మీ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది.
ఇదీ చదవండి: పెరిగిన ధరలు.. వెండి అవసరం!: మస్క్ ట్వీట్


