
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఇటీవల భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికి ఈ కారు కోసం 600 బుకింగ్స్ వచ్చాయిగా. తాజాగా ఈ సంస్థ దేశంలో తొలి కారును (First Tesla Car in India) డెలివరీ చేసింది. ఇంతకీ తొలి కస్టమర్ ఎవరో తెలుసా?
తెలుపు రంగు టెస్లా ‘మోడల్ వై’ కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి 'ప్రతాప్ సర్‌నాయక్' కొనుగోలు చేశారు. ముంబయిలోని ‘టెస్లా (Tesla) ఎక్స్‌పీరియెన్స్ సెంటర్’లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. మంత్రి ప్రతాప్ మాట్లాడుతూ.. దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన టెస్లా సంస్థ ఇటీవలే భారత్‌లో విక్రయాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జులై 15న ముంబయిలో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తరువాత ‘మోడల్ వై’ కారు (Tesla Model Y) విక్రయాలు మొదలయ్యాయి. చైనా (షాంఘై)లోని తమ ప్లాంటులో పూర్తిగా తయారైన కారును (సీబీయూ) దిగుమతి చేసుకుని టెస్లా విక్రయాలు చేపట్టింది.
#WATCH | Mumbai, Maharashtra: Delivery of the first Tesla (Model Y) car from 'Tesla Experience Centre' at Bandra Kurla Complex, Mumbai, being made to the State's Transport Minister Pratap Sarnaik.
'Tesla Experience Center', the first in India, was inaugurated on July 15 this… pic.twitter.com/UyhUBCYygG— ANI (@ANI) September 5, 2025
టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?
స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.