
ఇండియాలో తయారైన కార్లతో పోలిస్తే.. దిగుమతి చేసుకునే కార్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. వీటికి కస్టమైజేషన్ చేయడం వంటివి చేస్తే.. రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే భారత రాష్ట్రపతి కోసం సరికొత్త 'బీఎండబ్ల్యూ' కారును కొనుగోలు చేయనున్నారు. దీని ధర రూ. 3.66 కోట్లు అని తెలుస్తోంది. మరి ఇంత ఖరీదైన కారుకు జీఎస్టీ వర్తిస్తుందా?, లేదా?.. అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కోసం 'మెర్సిడెస్ బెంజ్ ఎస్600 పుల్‌మాన్ గార్డ్' ఉపయోగిస్తున్నారు. ఈ కారు స్థానంలో సరికొత్త బీఎండబ్ల్యూ కారు చేరనుంది. రాష్ట్రపతి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కార్లను మారుస్తూ ఉంటారు. ఈ కార్లు కస్టమ్స్ బుల్లెట్ ప్రూఫ్.
ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
సాధారణంగా హై ఎండ్ కార్లను దిగుమతి చేసుకుంటే.. చాలా రకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా జీఎస్టీ, ఐజీఎస్టీ, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, అదనపు సెస్సు వంటివి ఉంటాయి. కానీ రాష్ట్రపతి కోసం దిగుమతి చేసుకునే కారు కాబట్టి.. జీఎస్టీ నుంచి మాత్రమే కాకుండా సెస్సు నుంచి కూడా జీఎస్టీ కౌన్సిల్ మినహాయింపు కల్పించింది. ఇలాంటి మినహాయింపులు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రపతి కోసం ఈ వెసులుబాటు కల్పించారు. కాగా ప్రస్తుతం లగ్జరీ కార్లు 40 శాతం జీఎస్టీ స్లాబులో ఉన్నాయి.