
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పటి వరకు ధనవంతులు కావాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయం వెల్లడించారు. ఇప్పుడు దిగ్గజ దేశాల్లో తలెత్తే ఆర్థిక సంక్షోభం గురించి వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్రాన్స్ చారిత్రాత్మక బాస్టిల్ డే తిరుగుబాటును గుర్తుచేసే.. ఒక ముఖ్యమైన మలుపు దగ్గర పడుతోందని సూచించారు. ఈ అశాంతి నాటకీయ సామాజిక తిరుగుబాటుకు దారితీయవచ్చు. ఎందుకంటే ఫ్రాన్స్ ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. బాండ్ల భద్రత గురించి కియోసాకి ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు బాండ్లపై అంత విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. ఇది భవిష్యత్తును ఇబ్బందుల్లో పడేస్తుందని అన్నారు. బాండ్స్ ఎప్పుడూ సేఫ్ కాదు అని అన్నారు.
2020 నుంచి అమెరికన్ ట్రెజరీ బాండ్లు 13% తగ్గాయి. యూరోపియన్ బాండ్లు 24%, బ్రిటిష్ బాండ్లు 32% తగ్గాయిని కియోసాకి పేర్కొన్నారు. జపాన్, చైనాలు అమెరికా బాండ్లను వదులుకుని బంగారం & వెండిని కొనుగోలు చేస్తున్నాయి. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లలోనే పెట్టుబడులు పెట్టుకోవాలని చెబుతూనే ఉన్నానని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: డబ్బు పేదవాళ్లను చేస్తుంది!.. రాబర్ట్ కియోసాకి
అమెరికాలో పెరుగుతున్న రుణ సవాళ్ల గురించి రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. ఇది చరిత్రలో అతిపెద్ద రుణగ్రహీత దేశంగా మారిందని హైలైట్ చేసింది. ఆర్థిక స్థిరత్వం ప్రస్తుతం ముప్పులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలని పిలుపునిచ్చాయి.
EUROPE is TOAST:
French people are on verge of Bastille Day revolt. They’re bringing out their guiottinesand heads will roll as France may be forced to admit bankruotcy.
BONDS are not safe:
America is now the biggest debtor nation in world history.
Since 2020 American…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 31, 2025