
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్థితిని, స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా రిచ్‌డాడ్ పాఠం పేరుతో ఓ ట్వీట్ చేశారు. ఇందులో డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేయదు. చాలా సందర్భాలలో ప్రజలను మాత్రమే కాకుండా దేశాలను కూడా పేదరికంగా మారుస్తుందని అన్నారు. కోట్లు సంపాదించేవారు కూడా పదవీ విరమణ లేదా ఉద్యోగ విరమణ తరువాత సుమారు 7 సంవత్సరాలలో 65 శాతం మంది దివాళా తీస్తున్నారని రికార్డులు చూపిస్తున్నాయని కియోసాకి పేర్కొన్నారు. లాటరీ విజేతలకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు.
లక్షలాది డాలర్లు సంపాదించే వారు కూడా పేదవారు అవుతున్నారు. అమెరికాలో సగటు పని చేసే వ్యక్తిని తీసుకోండి, ఒక వెయిటర్ 50 సంవత్సరాల పాటు పనిచేసి సుమారు 1.75 మిలియన్ డాలర్లు సంపాదించాడు అనుకుంటే.. కొన్నేళ్ళకు ఆ డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది.
ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్‌లో 3 లక్షల ఉద్యోగాలు!
డబ్బు సంపాదించినప్పటికీ పేదవారుగా ఎందుకు అవవుతున్నారు?.. ఇది ఎందుకు జరుగుతుంది? అనే ప్రశ్నకు.. పేద తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బోధించే పూర్ ఫైనాన్సియల్ ఎడ్యుకేషన్ కారణమని రాబర్ట్ కియోసాకి సమాధానం ఇచ్చారు. ధనవంతులు కావాలంటే.. ధనవంతులైన వ్యక్తులను వెతకండి. విజయవంతమైన వ్యక్తుల గురించి తెలుసుకోండి అని ఆయన అన్నారు.
లాటరీ గెలిచి ఎందుకు నష్టపోవాలి లేదా జీవితాంతం పని చేసి ఎందుకు పేదవాడిగా మారాలి? అనే ప్రశ్నకు.. నువ్వు దానికంటే చాలా తెలివైనవాడివిగా ఉండాలని రాబర్ట్ కియోసాకి సింపుల్‌గా సమాధానం ఇచ్చారు.
RICHDAD $ LESSON:
Q: Does money make you rich?
A: NO: In most cases money makes people and countries poorer.
Take extreme examples of college sports stars who join a pro team earning Millions. Records show that 65% are bankrupt 7-years after retirement.
The same is true…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 19, 2025