రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ''ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన'' అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఒకప్పుడు బాగా చదివితే.. మంచి ఉద్యోగం వచ్చేది.. జీవితాంతం భద్రత ఉంటుందనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నా.. ఎప్పుడు జాబ్ నుంచి తీసేస్తారో తెలియదు. ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం చేసే వ్యక్తులకైనా.. ఊహకందని విధంగా లేఆఫ్ నోటీసులు వచ్చిన సందర్భాలు కోకొల్లలు.
2025లో కంపెనీలు తొలగించిన ఉద్యోగులు
➤యూపీఎస్: 48,000 ఉద్యోగాలు
➤అమెజాన్: 30,000 ఉద్యోగాలు
➤ఇంటెల్: 20,000 ఉద్యోగాలు
➤వెరిజోన్: 15,000 ఉద్యోగాలు
➤మైక్రోసాఫ్ట్: 6,000 ఉద్యోగాలు
➤సేల్స్‌ఫోర్స్: 4,000 ఉద్యోగాలు
➤జీఎం: 3,420 ఉద్యోగాలు
➤ఐబీఎం: 2,700 ఉద్యోగాలు
➤బోయింగ్: 2,500 ఉద్యోగాలు
➤వాల్‌మార్ట్: 1,500 ఉద్యోగాలు
ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో చాలావరకు హైటెక్ కంపెనీలే ఉన్నాయి. ఇంకెక్కడ ఉద్యోగ భద్రత ఉంది. ఉద్యోగం కంటే.. మీ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోండి. డబ్బు ఆదా చేయవద్దు. దీనికి బదులుగా బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం వంటిని ఆదా చేయడి. అవే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయని కియోసాకి పేర్కొన్నారు.
ఇక్కడ కియోసాకి భావన ఏమిటంటే.. ఇంతపెద్ద ప్రైవేట్ కంపెనీ అయినా మీకు ఉద్యోగ భద్రత కల్పించదు. కాబట్టి ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. డబ్బు ఎలా పనిచేస్తుంది అన్న జ్ఞానం పెంచుకోండి. “డబ్బు సేవ్ చేయకండి” అని ఎందుకు అంటున్నారంటే.. డబ్బును బ్యాంకులో డబ్బు ఉంచితే విలువ తగ్గిపోతుందని (ద్రవ్యోల్బణం వల్ల) కియోసాకి అభిప్రాయం. కాబట్టి డబ్బును నేరుగా సేవ్ చేసుకోకుండా.. విలువ పెంచే వస్తువులలో పెట్టుబడిగా పెట్టాలి.
ఇదీ చదవండి: అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే..
ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన అనే విషయానికి వస్తే.. దీని అర్థం చదువు అవసరం లేదు అని కాదు. ధనవంతులు అవ్వడానికి కేవలం చదువే సరిపోతుంది అన్న ఆలోచనకు సంబంధించింది. అంటే.. చదువుతో పాటు, డబ్బు నిర్వహణపై అవగాహన కూడా అవసరం. అప్పుడే సంపన్నులవుతారు.
WHY GOING TO SCHOOL for job security is an obsolete idea:
LAY OFFS 2025
1: UPS 48,000 jobs
2: AMAZON 30,000 jobs
3: INTEL 20,000 jobs
4: VERIZON 15,000 jobs
5: MICROSOFT 6,000 jobs
6: SALES FORCE: 4,000 jobs
7: GM: 3,420 jobs
8: IBM: 2,700 jobs
9: BOEING…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 4, 2026


