అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే.. | Who is The Most Educated in the Ambani Family | Sakshi
Sakshi News home page

అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే..

Jan 3 2026 2:13 PM | Updated on Jan 3 2026 7:35 PM

Who is The Most Educated in the Ambani Family

భారతదేశంలో అత్యంత సంపన్నులైన అంబానీ ఫ్యామిలీ గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఈ కుటుంబంలో ఎవరు ఎంత చదువుకున్నారు?, అనే విషయం బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ధీరూభాయ్ అంబానీ: రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ, 1933 డిసెంబర్ 28న గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ధీరూభాయ్ హీరాచంద్ అంబానీ. ధీరూభాయ్ ఉన్నత పాఠశాల వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తరువాత డబ్బు సంపాదించడానికి.. యెమెన్‌కు వెళ్లారు. ఇక్కడ పెట్రోల్ పంప్‌లో పనిచేశారు. రిలయన్స్ గ్రూప్‌కు పునాది వేసిన ధీరూభాయ్‌కు అంతకు ముందు పూర్వీకుల నుంచి వచ్చిన సంపద లేదు.

ముఖేష్ అంబానీ: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఎంబీఏ కోసం స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. కానీ ఎంబీఏ పూర్తి చేయకుండానే.. తన చదువును మధ్యలో వదిలివేసి 1980లో రిలయన్స్‌లో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు.

అనిల్ అంబానీ: ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ ముంబైలోని హిల్ గార్డెన్ స్కూల్ నుంచి పాఠశాల విద్య, ఆ తరువాత, కిషన్ చంద్ చెల్లారం కళాశాల నుంచి సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత 1983లో, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

నీతా అంబానీ: ముఖేష్ అంబానీ భార్య.. నీతా అంబానీ ముంబైలోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈమెకు నృత్యం, బోధన అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే నీతా అంబానీ.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించారు.

టీనా అంబానీ: అనిల్ అంబానీ భార్య.. నటి టీనా అంబానీ ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అంతే కాకుండా ఈమె లాస్ ఏంజిల్స్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేయారు.

ఆకాష్ అంబానీ: ఆకాష్ అంబానీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను.. ఆ తర్వాత, 2013లో అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆకాష్ ఇప్పుడు తన తండ్రికి తన వ్యాపారంలో సహాయం చేస్తున్నాడు.

శ్లోకా మెహతా అంబానీ: ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా.. న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో పట్టభద్రురాలైంది. అంతే కాకుండా ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

ఇషా అంబానీ: ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ.. 2014లో అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ.. ఆ తరువాత కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

అనంత్ అంబానీ: అనంత్ అంబానీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను, తరువాత బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇప్పుడు అనంత్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డులో అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు.

రాధిక మర్చంట్ అంబానీ: ముఖేష్ అంబానీ చిన్న కోడలు రాధిక మర్చంట్ ముంబైలోని ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్, బీడీ సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్య.. తరువాత 2017లో న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయాలు & ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు.

జై అన్మోల్ అంబానీ: అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను, ఆ తరువాత యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు.

క్రిషా షా అంబానీ: జై అన్మోల్ భార్య.. అనిల్ అంబానీ కోడలు క్రిషా షా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు. దీనితో పాటు, ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ కూడా పొందారు.

జై అన్షుల్ అంబానీ: అనిల్ అంబానీ చిన్న కుమారుడు జై అన్షుల్ అంబానీ ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత, అతను NYU స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement