
న్యూఢిల్లీ: మ్యాట్రెస్‌ల తయారీ సంస్థ డ్యూరోఫ్లెక్స్ తమ పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. దీని ప్రకారం రూ. 183.6 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.25 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయించనున్నారు.
తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్తగా 120 స్టోర్స్ (కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ – కోకో) ప్రారంభించేందుకు, ప్రస్తుత స్టోర్స్.. తయారీ ప్లాంటు లీజులు–అద్దెలు చెల్లించేందుకు, మార్కెటింగ్ వ్యయాలు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.
1963లో ప్రారంభమైన డ్యూరోఫ్లెక్స్, మార్కెట్ వాటాపరంగా దేశీయంగా టాప్ 3 మ్యాట్రెస్‌ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. డ్యూరోఫ్లెక్స్, స్లీపీహెడ్ బ్రాండ్స్ పేరిట మ్యాట్రెస్‌లు, సోఫాలు, ఇతరత్రా ఫర్నిచర్లు మొదలైనవి విక్రయిస్తోంది. 2025 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 73 కోకో స్టోర్స్, 5,500 పైగా జనరల్ ట్రేడ్ స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,057 కోట్లుగా ఉన్న ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,134 కోట్లకు చేరింది.