తాజాగా సెబీ ఆమోదముద్ర
జాబితాలో అమాగీ మీడియా ల్యాబ్స్
ఫ్రాక్టల్ అనలిటిక్స్, సహజానంద్ మెడికల్
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ ఈ క్యాలండర్ ఏడాది(2025)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులవైపు దూసుకెళుతున్నాయి. నిజానికి 2024లో 76 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా ఉమ్మడిగా రూ. 1.53 లక్షల కోట్లు సమీకరించాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే మెయిన్‌బోర్డులో 93 కంపెనీలు రూ. 1.54 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో మరో మూడు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
ఏఐ సొల్యూషన్స్
ఎండ్‌టు ఎండ్ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సొల్యూషన్లు అందించే ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 1,279 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 3,621 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా మొత్తం రూ. 4,900 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.
ఐపీవోలో క్వినాగ్ బిడ్కో రూ. 1,463 కోట్లు, టీపీజీ హోల్డింగ్స్ రూ. 2,000 కోట్లు, జీఎల్‌ఎమ్ కుటుంబ ట్రస్ట్ రూ. 129 కోట్లు విలువైన షేర్లను ఆఫర్ ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ కంపెనీ ఫ్రాక్టల్ యూఎస్‌ఏలో పెట్టుబడులు, కొత్త కార్యాలయాల ఏర్పాటు, ఆర్‌అండ్‌డీ, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వెచి్చంచనుంది.
సాస్ కంపెనీ
సాస్ సర్వీసులందించే అమాగీ మీడియా ల్యాబ్స్ ఐపీవోలో భాగంగా రూ. 1,020 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రస్తుత వాటాదారులు 3.41 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 667 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది.
కార్డియాక్ స్టెంట్స్
2001లో ఏర్పాటైన మెడికల్ పరికరాల తయారీ కంపెనీ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ ఐపీవోకు రానుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.76 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేర్లు ఆఫర్ చేయనున్న సంస్థలలో శ్రీ హరి ట్రస్ట్, సమారా క్యాపిటల్ మార్కెట్స్ హోల్డింగ్, కొటక్ ప్రీఐపీవో అపార్చునిటీస్ ఫండ్ తదితరాలున్నాయి. కంపెనీ ప్రధానంగా కార్డియాక్ స్టెంట్స్‌ను తయారు చేస్తోంది. కంపెనీ భారత్, థాయ్‌లాండ్‌లలో రెండు ఆర్‌అండ్‌డీ కేంద్రాలను నిర్వహిస్తోంది.


