సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే? | Suzuki e Access Electric Scooter Launched At Rs 1 88 Lakh | Sakshi
Sakshi News home page

సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?

Jan 9 2026 5:57 PM | Updated on Jan 9 2026 6:18 PM

Suzuki e Access Electric Scooter Launched At Rs 1 88 Lakh

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా 'ఈ-యాక్సెస్' పేరుతో భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిని కంపెనీ గురుగ్రామ్ ప్లాంట్‌లో తయారు చేయనుంది.

బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్న సుజుకి ఈ-యాక్సెస్.. 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ద్వారా 95 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇందులోని 4.1 కేడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటారు 15 Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది.

సుజుకి ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, మూడు రైడింగ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్‌ మొదలైనవి పొందుతుంది. ఇందులో బ్లూటూత్/యాప్ కనెక్టివిటీ & USB ఛార్జింగ్ పోర్ట్‌ కూడా లభిస్తాయి. ఇది నాలుగు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement