క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పెట్టుబడి సలహాదారులు(ఐఏలు), పరిశోధనా విశ్లేషకులు(ఆర్‌ఏలు)గా గుర్తింపు పొందేవారి అర్హతల నిబంధనలను సడలించింది. తద్వారా ఇందుకు రిజి్రస్టేషన్ చేసుకునేందుకు గ్రాడ్యుయేట్లను అనుమతించింది. అయితే ఎన్‌ఐఎస్‌ఎం సర్టిఫికేషన్ పరీక్షలో ఉత్తీర్ణతను తప్పనిసరి నిబంధనగా చేర్చింది.
దీంతో అర్హతపొందే వ్యక్తులు సంబంధిత విభాగంలో విజ్ఞానంతోపాటు వృత్తిసంబంధ అవగాహనను కలిగి ఉండే వీలు కల్పించింది. సెబీ తాజాగా జారీ చేసిన రెండు నోటిఫికేషన్లలో నిబంధనల సవరణలను పేర్కొంది. ప్రస్తుతం దరఖాస్తుదారులు ఫైనాన్స్ సంబంధ విభాగాలలో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయవలసి ఉంది.
ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, ఎకనమిక్స్, క్యాపిటల్ మార్కెట్లలో డిగ్రీ కలిగినవారికి మాత్రమే రిజిస్ట్రేషన్‌కు వీలు కల్పిస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఏ విభాగంలోని గ్రాడ్యుయేట్లకైనా రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉంటుంది. అయితే ఇందుకు ఎన్‌ఎస్‌ఐఎం పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి.


