రోజూ ఇన్‌కంట్యాక్స్ వారి వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పర్సనల్ అకౌంటులో లాగిన్ అయ్యి మీ వివరాలు చూసుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఆడిటర్ నుంచి మీ లాగిన్ వివరాలు తీసుకోండి. ప్రతిసారి ఆడిటర్స్ దగ్గరకు పరిగెత్తకుండా మీరే లాగిన్ అవ్వొచ్చు.
నోటీసు/సమాచారం
ఇన్‌కమ్ ట్యాక్స్ సైట్‌లో లాగిన్ అయ్యి ... డాష్ బోర్డులోని పెండింగ్ యాక్షన్స్‌లో ఈ–ప్రొసీడింగ్స్‌ని క్లిక్ చేయండి. అందులో నోటీసులు ఉంటాయి. ఆ నోటీసుని చూడండి. దీనిని VIEW అంటారు. దానిలో నోటీసులు ఉంటే డౌన్‌లోడ్ చేసుకోండి. అప్పుడు నోటీసులో ఏముందో అర్థమవుతుంది.
నోటీసులెన్నో రకాలు, మరెన్నో అంశాలు
డిఫెక్టివ్ నోటీసు అంటారు. బదులుగా సకాలంలో దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
అలా సర్దుబాటు చేస్తే సరిపోతుంది.
143 (1) ప్రకారం ఒక స్టేట్‌మెంట్ పంపిస్తారు. ఆదాయంలో కానీ పన్ను భారం లెక్కింపులో కానీ వ్యత్యాసాలుంటే తెలియజేస్తారు. ఆదా యం ‘కాలమ్’ మీరు వేసింది. అధికారి అస్సె స్ చేసింది పక్కపక్కనే ఉంటాయి. ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూసుకొండి. హెచ్చుతగ్గులుంటాయి. మినహాయింపులుంటాయి.
కూడికల్లో లేదా తీసివేతల్లో పొరపాట్లు రావచ్చు.
పన్ను చెల్లింపుల విషయంలో రికార్డులు అప్‌డేట్ కాకపోవడం వల్ల తేడాలుంటాయి.
అలాంటి సందర్భాల్లో ట్యాక్స్ చెల్లించమంటారు.
ఆ సర్దుబాటు ఆర్డర్లు ఉంటాయి.
మీరు వాటితో ఏకీభవిస్తేనే పన్ను కట్టండి. ఒప్పుకోకపోతే అంటే అంగీకరించకపోతే డాక్యుమెంట్లు పొందుపరుస్తూ జవాబు ఇవ్వండి.
స్క్రూటినీకి ఎంపిక అయితే ఏయే సమాచారం ఇవ్వాలో అడుగుతారు. ఇవ్వండి.
ముందుగా AGREE/ NOT AGREE చెప్పండి
అనవసరంగా వాయిదాలు అడగొద్దు. అవసరం అని తెలిస్తేనే టైం అడగండి
అంతా ఫేస్‌లెస్ ... మీ మీద ఎటువంటి ఒత్తిళ్లు ఉండవు.
అధికారులు ఎంతో ఓపికగా మీ రిప్లై చదువుతారు.
సాధారణంగా తప్పులేం జరగవు
అవసరం అయితే నిబంధనల మేరకు మీరు అప్పీల్‌కు వెళ్లవచ్చు.


