నవంబర్ నెల ముగుస్తోంది. సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలలో చేయాల్సిన పనుల గురించి చాలా మంది ముందుగా షెడ్యూల్ వేసుకుంటూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనవి బ్యాంకు పనులు. అయితే ఇందు కోసం బ్యాంకు బ్రాంచిలు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో రానున్న నెలలో బ్యాంకు సెలవులు ఏయే రోజుల్లో ఉన్నాయో ఇక్కడ అందిస్తున్నాం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) క్యాలెండర్ ప్రకారం.. ప్రభుత్వ సెలవు దినాలు, వారాంతపు మూసివేత కారణంగా డిసెంబరులో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు దాదాపు 18 రోజులు మూసి ఉంటాయి. సెలవుల జాబితాలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలతోపాటు జాతీయ, ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి.
సెలవు దినాలలో అన్ని బ్యాంకు బ్రాంచీల వద్ద సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఖాతాదారులు తమ బ్యాంకుల ప్రాంతీయ సెలవు క్యాలెండర్ ప్రకారం బ్రాంచీ సందర్శనలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, సెలవు దినాలలోనూ ఆల్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్స్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లావాదేవీలు వంటి ఆన్లైన్ సేవలను వినియోగించుకోవచ్చు.
డిసెంబర్లో సెలవులు ఇవే..
డిసెంబర్ 1 - అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లలో రాష్ట్ర అవతరణ దినోత్సవం
డిసెంబరు 3 - గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ
డిసెంబరు 7- ఆదివారం
డిసెంబరు 12 - మేఘాలయలో పా టోగన్ నెంగ్మింజా సంగ్మా వర్ధంతి
డిసెంబర్ 13 - రెండో శనివారం
డిసెంబరు 14- ఆదివారం
డిసెంబర్ 18 - మేఘాలయలో యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా
డిసెంబర్ 19- గోవాలో విమోచన దినోత్సవం
డిసెంబర్ 20 - సిక్కిం, గోవాలో లోసూంగ్ / నామ్సూంగ్
డిసెంబరు 21- ఆదివారం
డిసెంబర్ 22 - సిక్కింలో లోసూంగ్ / నామ్సూంగ్
డిసెంబర్ 24 - మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో క్రిస్మస్
డిసెంబర్ 25 - క్రిస్మస్ సందర్భంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేత
డిసెంబర్ 26 - మిజోరం, నాగాలాండ్, మేఘాలయలలో క్రిస్మస్ వేడుకలు
డిసెంబర్ 27 - నాలుగో శనివారం
డిసెంబరు 28- ఆదివారం
డిసెంబర్ 30 - మేఘాలయలో యు కియాంగ్ నంగ్బా వర్ధంతి
డిసెంబర్ 31 - మిజోరాం, మణిపూర్ లలో నూతన సంవత్సర వేడుకలు / ఇమోయిను ఇరాట్పా


